Mr. Kiran Kumar Varaka(S.No. 26) Contestant as Independent in Mahabubnagar-Rangareddy-Hyderabad Graduate MLC

Estudies4you

Mr. Kiran Kumar Varaka(S.No. 26)  Contestant in Mahabubnagar-Rangareddy-Hyderabad Graduate MLC as Independent Candidate 

Polling Date: 14 March, 2021 (8.00 A.M to 4.00 P.M)

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి కిరణ్ కుమార్ వరకా  (S.No. 26)


ఈ క్రింది సమస్యల పోరాటానికై మన ఆయుధంగా ఓటు ని ఉపయోగించుకుందాం మన సమస్యలను పరిష్కరించుకుందాం. 

ఈ రోజు మనం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు 

    *నిరుద్యోగం

    *సమానపనికి సమాన వేతనం, కనీస వేతనం

    *అధ్యాపకుల సమస్యలు 

    *పట్టభద్రుల రైతన్నల సమస్యలు 

**నిరుద్యోగ సమస్యలు

మన ఉద్యోగాలు మనకి వస్తాయని పోరాడి మన తెలంగాణను తెచ్చుకున్నాము కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం ఈ బంగారు తెలంగాణ కోసమా పోరాటం చేసింది అని బాధపడే వారు చాలామంది ఉన్నారు. కొందరు రాజకీయ నాయకుల స్వార్థం,వారు చేసే అవినీతి వల్ల మనం ఇంకా వెనుకబడి పోయాము. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకి గౌరవ వేతనం చెల్లిస్తామని హామీలు ఇచ్చింది కానీ ఇంతవరకు ఏ ఒక్కరికి చెల్లించలేదు. Group-III, IV, Teachers ఇంకా అనేక ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. కొన్ని కొన్ని శాఖలలో రాత పూర్వకంగా నిర్వహించవలిసిన నియామక పక్రియను అసలు అనుభవం లేని ఒప్పంద ఉద్యోగులకు ఇచ్చి మన పొట్టలు కొడుతుంది ఈ ప్రభుత్వం. కరోనా వల్ల మన బతుకులు ఇంకా దిగజారాయి. ఒక్కసారి ఆలోచించండి దీనికి కారణం ప్రశ్నించేవాడు లేకపోవడమే. 

**సమానపనికి సమాన వేతనం, కనీస వేతనం

బయట చిన్న చిన్న కూలీ పనులు చేసే వారు కూడా రోజుకు Rs.600-1000 వరకు సంపాదిస్తున్నారు. మనలో ఎంతమంది మనం చేసే పనికి సరిపడ వేతనం పొందుతున్నాము?ఎంతమంది  చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం చేస్తున్నాము? మన ఉద్యోగ అవసరాన్ని ఆసరాగా తీసుకొని చాలా యాజమాన్యాలు మనల్ని దోచుకుంటున్నాయి దీనికి తోడు కొంతమంది ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయ నాయకులు వారు చేసే అక్రమాలను బయటపడకుండా కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసే పనే మనం చేస్తున్నాము ఇంకా చెప్పాలంటే వారికంటే ఎక్కువగా పని చేస్తున్నాము కానీ సమాజంలో వారికి మర్యాద మనకీ అవమానాలు,ఎందుకీ వివక్ష? కారణం సమాన పనికి సమాన వేతనం పొందకపోవటం.  అన్ని రంగాలలో పనిచేసే ప్రతియొక్క ఉద్యోగికి కనీస వేతనం ఇవ్వాలి. మనం ఇప్పటికైనా పోరాడి మన హక్కుని మనం సాధించుకుందాం. 

**ప్రైవేట్ అధ్యాపకుల సమస్యలు

నేటి బాలలే రేపటి పౌరులు వీరిని తీర్చి దిద్దేది మన అధ్యాపకులే కానీ మన సమాజంలో ఈ రోజు ఆ అధ్యాపకులను ఎంత చులకనగా చూస్తున్నారో ప్రైవేట్ విద్యాసంస్థలలో పనిచేసే ప్రతియొక్క అధ్యాపకుడికి తెలుసు. అసలే మన బతుకులు అంతంత మాత్రమే అంటే, ఈ కరోనా వచ్చి మనలో చాలామంది జీవితాలని రోడ్డున పడవేసింది. ఒంట్లో శక్తి ఉన్నవారు కుటుంబ పోషణకై కూలీ పనులు చేసి గడుపుతున్నారు. కొందరైతే అప్పుల బాధలు తట్టుకోలేక పరువు మర్యాదల కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకొందరు జీతాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. 

మన అధ్యాపకుల రక్షణ కోసం G.O. 467, Education Act-1982 లను రూపొందించారు. దీనిని సక్రమంగా అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదే కానీ ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మన తెలంగాణ ప్రభుత్వం కరోనా కష్ట కాలంలో ఎవరి ఉద్యోగాలు తొలిగించరాదని, అందరికి జీతాలు చెల్లించాలని G.O. 45 ను విడుదల చేసారు. కానీ G.O. 45 ను సక్రమంగా అమలుచేయకపోవడం వల్ల ఎందరో ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోయి దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. 

రాష్ట్రంలో విద్యాసంస్థల్లో పనిచేసే అధ్యాపకులకు Norms ప్రకారం జీతం ఇస్తారు కానీ ఈ సంస్థల యొక్క యాజమాన్యాలు మన ఉద్యోగ అవసరాన్ని అడ్డంపెట్టుకుని ఆ వేసిన జీతంలో సగం అంతకంటే ఎక్కువగా సాక్ష్యాధారాలు లేకుండా తిరిగి తీసుకుంటారు. ప్రభుత్వానికి అన్ని తెలిసినను కూడా ఏమి తెలియనట్టు ఉంటుంది.  ఇంకా చెప్పాలంటే ఆ ప్రభుత్వాల్లో పనిచేసే ప్రజాప్రతినిధులు చాలా విద్యాసంస్థల యొక్క యాజమాన్యాలు. ఈ విధంగా మనలని దోచుకోవడమే కాకుండా కనీసం మనకి న్యాయ పోరాటం చేసే అవకాశం లేకుండా చేస్తున్నారు. చాలామంది ప్రభుత్వ అధికారులు విద్యాసంస్థల యాజమాన్యాలకు అమ్ముడుపోయి వారు ఏది చెపితే అది చేస్తారు. 

మనలో ఐక్యత లేకపోవడం వల్లనే ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు వారి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. మనమందరం కలిసికట్టుగా ఈ వ్యవస్థని మార్చుదాం. 

Note: ఇన్ని రోజులు మన సమస్యలు పట్టించుకోని ఈ రాజకీయ నాయకులు MLC ప్రకటన విడుదల చేయగానే ఓట్ల కోసం మేము మీ సమస్యలను పరిష్కరిస్తాం అని దొంగ ప్రచారాలు చేస్తున్నారు అలాంటి వారితో జాగ్రత్త.

**పట్టభద్రుల రైతన్నల సమస్యలు

మనదేశానికి వెన్నుముక రైతు అంటారు అలంటి రైతు  ఈ రోజు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడో మీలో ప్రతి ఒక్కరికి తెలుసు. చాలామంది పట్టభద్రులు సరైన ఉద్యోగం దొరక్క గౌరవంగా బతకడానికి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. దీనిని కూడా ఒక ఉద్యోగంలాగా పరిగణించి వారికి గౌరవ వేతనం వచ్చేలా చేయడం మనందరి కర్తవ్యం. 

పైన పేర్కొన్న సమస్యల పరిష్కరానికి మీ యొక్క మొదటి (1) ప్రాధాన్యత ఓటు కిరణ్ కుమార్ వరకా(S.No. 26)  కు వేసి రాజకీయ నాయకులను ఓడిద్దాం. 


మీ

కిరణ్ కుమార్ వరకా (S.No. 26)

అసిస్టెంట్ ప్రొఫెసర్ 

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి 

All India Private Colleges Employees Union (AIPCEU) State President

గమనిక: మీరు పైన పేర్కొన్న సమస్యలను ఎదుర్కొంటున్నట్లైతే దయచేసి మీ తోటి మిత్రులకు ఈ సందేశాన్ని forward చేసి మన ఈ పోరాటంలో మీ వంతు సాయం చేయగలరని కోరుకుంటున్నాను. 

--- జై భారత రాజ్యాంగం !

To Top